AP Minister: ‘పవన్’ ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో ప్రజలకైనా చెప్పాలి: పెద్దిరెడ్డి

9 May, 2022 15:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప‍్రతిపక్ష పార్టీల పొత్తులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘‘2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయల నుండి వైదొలగక తప్పదు. చంద్రబాబుకి ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని చంద్రబాబుకి తెలుసు.. అందుకే పొత్తులకోసం పాకులాడుతున్నారు.

చంద్రబాబుని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోమని సూచిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉంది. అందుకే మేము ధైర్యంగా ఒంటరిగా పోటీ చేస్తున్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోడు దొంగలని అందరికీ తెలుసు. బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీతో మరో పొత్తుకు ప్రయత్నిస్తున్నాడు. పవన్ ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలి’’ అని సూచించారు.

ఇది కూడా చదవండి: అందుకే దత్తపుత్రుడితో కలిసి బాబు కుయుక్తులు: ఎంపీ నందిగం సురేష్

మరిన్ని వార్తలు