‘జగనన్న కాలనీలు’ సీఎం జగన్ మానసపుత్రికలు: మంత్రి పెద్దిరెడ్డి

1 Jul, 2021 10:57 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: జగనన్న కాలనీలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రికలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇళ్లు మెగా గ్రౌండింగ్‌ డ్రైవ్‌లో భాగంగా గురువారం పుంగనూరులో జగనన్న కాలనీల నిర్మాణానికి పెద్దిరెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న కాలనీల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు ఆనందపడేలా నివాస గృహాలు ఉంటాయని తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని పెద్దరెడ్డి పేర్కొన్నారు. 

అనంతపురం: ఉరవకొండ జగనన్న కాలనీల్లో మెగా హౌసింగ్ గ్రౌండింగ్‌ మేళా, ఇళ్ల నిర్మాణాలకు మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గంగాధర్‌గౌడ్‌ పాల్గొన్నారు.
రాయదుర్గం పట్టణ బిటిపి లేఅవుట్‌లో జగనన్న కాలనీల్లో మెగా హౌసింగ్ గ్రౌండింగ్‌ మేళాలో భాగంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
ఆలమూరు లేఅవుట్‌లో జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి భూమి పూజ చేశారు.

విశాఖపట్నం: పెందుర్తి మండలం గుర్రంపాలెంలో జగనన్న కాలనీల నిర్మాణానికి మంత్రి అవంతి శ్రీనివాస్‌ భూమి పూజ చేశారు.

కర్నూలు: ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో జగనన్నకాలనీలో గృహ నిర్మాణాల్లో భాగంగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి భూమి పూజ చేశారు.

కృష్ణా: మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామంలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న 600 ఇళ్ల నిర్మాణ పనులకు మంత్రి పేర్నినాని శంకుస్థాపన చేశారు. విజయవాడ రూరల్ మండలం నున్నలో వైఎస్సార్ జగనన్న మోడల్ లేఅవుట్‌లో లబ్ధిదారులతో కలసి ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భూమిపూజ చేశారు. 

పశ్చిమగోదావరి: ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని భీమడోలులో జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పాల్గొని భూమి పూజ చేశారు.

వైఎస్సార్‌ కడప: కడప నియోజకవర్గ పరిధిలో పలు జగనన్న లేఅవుట్‌లలో మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష, మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు.

ప్రకాశం: జరుగుమల్లి మండలం కె బిట్రగుంటలో జగన్న కాలనీలో ఇళ్లకు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ మాదాశి వెంకయ్య శంఖుస్థాపన చేశారు.

విజయనగరం: కొమరాడ మండలం గుణానుపురం గ్రామంలో మెగా హౌసింగ్ మేళాను సబ్ కలెక్టర్ వేంకటేశ్వరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. చీపురుపల్లి అగ్రహారంలో జగనన్న ఇళ్లు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. 

ఏపీలో పేదలందరికీ ప్రభుత్వం ఇళ్లు మెగా గ్రౌండింగ్‌ డ్రైవ్‌ను చేపట్టింది. గురువారంతోపాటు, ఈ నెల 3, 4 తేదీల్లో అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున గృహనిర్మాణ శంకుస్థాపనలు జరగన్నాయి. రోజుకు లక్ష ఇళ్ల చొప్పున మూడు రోజుల్లో 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున గృహనిర్మాణ శంకుస్థాపనలు జగరనున్నాయి. వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో శంకుస్థాపన కార్యక్రమాల్లో ఇన్‌ఛార్జ్‌, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనున్నారు.

చదవండి: వైఎస్సార్‌ స్వప్నం పోలవరం.. జగన్‌ హయాంలో సాకారం

మరిన్ని వార్తలు