ఈనాడు పత్రికకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది: మంత్రి పెద్దిరెడ్డి

28 Oct, 2022 14:33 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఈనాడు పత్రికకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. విశాఖ రాజధానిగా ఇష్టం లేకపోవడం వల్లే కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి అని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు ప్రాంతాల అభివృద్ధే మా పార్టీ విధానం. ఈనాడు పత్రికకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. రూ.లక్షల కోట్ల కబ్జా గతంలో రాసింది మీరే కదా?. సిట్‌ వేసింది కూడా చంద్రబాబు హయంలోనే కదా?.

మీ రాతలతో చంద్రబాబు తలరాత మార్చడం సాధ్యం కాదు. కుక్కతోక వంకర మాదిరిగానే మీ బుద్ధి ఎప్పటికీ మారదు. విశాఖలో అక్రమాలకు పాల్పడిన అధికారులపైన మేము చర్యలు తీసుకున్నాం. చంద్రబాబుకు రాజకీయంగా నడిచే సామర్ధ్యం లేదు. టీడీపీ నాయకులు రిషికొండ దగ్గరకు వెళ్తే ఉత్తరాంధ్రను రక్షించినట్లు అవుతుందా?. పాదయాత్రను ఎందుకు మధ్యలోనే నిలిపివేశారో వారికే తెలియదు అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు