Peddireddy Ramachandra Reddy: గనులు, విద్యుత్‌, అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

12 Apr, 2022 11:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: గనులు, విద్యుత్‌, అటవీశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అంతకమందు సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి పెద్దిరెడ్డి దంపతులు, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, గనులు, విద్యుత్‌ శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. 

ఆదాయం మరింత పెంచేందుకు కృషి చేస్తా
బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడాను. సీఎం జగన్‌ని పిన్నెల్లి కలుస్తారు. అన్నా రాంబాబు, సామినేని ఉదయభానులకు కూడా సర్ది చెప్పాను. సీఎం జగన్‌ అందరికీ గుర్తింపు, గౌరవం ఇస్తారు. 

నాకు ఇచ్చిన మూడు శాఖల్లో మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తా. రైతులకు ఉచిత విద్యుత్‌ని సమర్థవంతంగా అమలు చేస్తాము. పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం. గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల వలన ఆదాయం పెరిగింది. ఆ ఆదాయం మరింత పెంచేందుకు కృషి చేస్తాను' అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

చదవండి: (మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చెల్లుబోయిన వేణు)

రాజకీయ నేపథ్యం: 1974 ఎస్వీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1985లో కాంగ్రెస్‌ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 1989లో పీలేరు నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఓటమిపాలైన ఆయన పీలేరు నుంచి 1999, 2004 సంవత్సరాల్లో, పుంగనూరు నుంచి 2009లో విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1995-2004 మధ్య తొమ్మిదేళ్లు చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. 2009 నుంచి 2010 వరకు వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గాల్లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 2012 నవంబర్‌లో రాజీనామా చేశారు. ఆ తర్వాతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తిరిగి రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు