మాకు అగౌరవం కలిగేలా నిమ్మగడ్డ వ్యవహరించారు

2 Feb, 2021 13:17 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ బలవంతుపు ఏకగ్రీవాలు వద్దని చేప్తున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే మాట చెప్పారని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాము దౌర్జన్యాలు చేయలేదు, కానీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏ విధంగా బెదిరించారో అందరూ చూశారన్నారు. కేసు పెడితే వేధిస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారన్నారు... అలాగే నిమ్మడలో దువ్వడా శ్రీనివాస్‌కు ఏం పని అని అంటు తామేదో కుట్ర చేశామంటున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఉత్తరాంధ్రపై క్షక్ష్య కట్టాడు అంటూ తమపై అరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి మాటలు నమ్మెద్దని, మొన్న నిమ్మగడ్డ కడపలో వైఎస్సార్‌ గురించి బాగా చెప్పారు.. మరీ చిత్తూరులో ఓటుకు నోటు కేసు గురించి కూడా మాట్లాడాలి కదా అని ప్రశ్నించారు. 

చిత్తూరు జిల్లాలో పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతులు అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో అన్నీ మీరే చేస్తున్నారని, తిరిగి తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారన్నారు. ఈ ఎన్నికలు ఆదర్శవంతంగా జరగాలని కోరుకుంటున్నామంటూ ఆ యాప్‌ చౌదరిగారే తయారు చేసుకుంటున్నారో లేక ఎస్ఈసీ తపున చేస్తున్నారా అని అన్నారు. తమలో చాలా మంది సినీయర్‌‌ మంత్రులు ఉన్నారని,  తాము అనేక సార్లు ఎమ్మెల్యేలుగా పని చేశామన్నారు. కానీ యాప్‌ తయారు చేసేందుకు మమ్మల్ని నిమ్మగడ్డ వివరణ కోరలేదన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌కు‌ కూడా చెప్పలేదు అన్నారు. గవర్నర్‌ను బెదిరించే ధోరణిలోనే లేఖ రాశారని, తాను, మంత్రి బొత్స చాలా బాధపడ్డామన్నారు. అందుకే ప్రివిలేజ్‌ కమిటీకి వెళ్లామని, అక్కడ తమకు అగౌరవం కలిగేలా నిమ్మగడ్డ వ్యవహరించారన్నారు. అందుకే స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. టీడీపీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి.. ప్రజలే ఏది నిజమో నిర్ణయిస్తారన్నారు. ఆ యాప్ చూస్తుంటే‌ టీడీపీ వారి యాప్‌లానే ఉందన్నారు. కాగా రేపు విడుదల చేశాక దీనిపై స్పందిస్తామని మంత్రి వ్యాఖ్యానించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు