చంద్రబాబు తీరుపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం

4 Jan, 2023 18:29 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: చంద్రబాబు పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా దిగజారి రాజకీయాలు చేస్తున్నాడంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వ్యవహారశైలి మంచిది కాదని అన్నారు. తన కార్యకర్తలను పోలీసులపై రెచ్చగొట్టే ధోరణిలో ప్రసంగించడం.. వారిని పోలీసులపైకి ఉసిగొల్పే ధోరణి సరికాదన్నారు.

ఈమేరకు మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వల్ల రాజకీయ నేతల విలువ పోతోంది. చంద్రబాబు లాగే ఆయన కార్యకర్తలూ ఉన్నారు. పుంగనూరులో రాళ్లు, కర్రలతో గలాటా చేశారు. పోలీసులను కొట్టేలా కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. లాఠీఛార్జ్‌కు చంద్రబాబే కారణం. రాష్ట్రంలో అధికార, విపక్షాలకు నిబంధనలు ఒక్కటేనని స్పష్టం చేశారు.

కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోతే జాగ్రత్తగా ఉండాల్సిందిపోయి.. కుప్పంలో కూడా అదే మాదిరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఎంతమంది చనిపోయిన కూడా నేను అధికారంలోకి రావాలి అనే ధోరణికి నిదర్శనం అంటూ మండిపడ్డారు.

చదవండి: (నాకే రూల్స్‌ చెబుతారా..? కుప్పంలో పోలీసులపై చంద్రబాబు వీరంగం)

చట్టానికి ఎవరూ అతీతులు కాదు
విశాఖలో గ్యాస్ లీకై చనిపోయిన బాధితులకు ఫ్యాక్టరీ యజమాని నుంచి, పొల్యూషన్ బోర్డు నుంచి కోటి రూపాయలు ఇప్పించ్చాం. అప్పుడు ఏదేదో మాట్లాడారు. మేము నిన్న కూడా చంద్రబాబు వల్ల చనిపోయిన బాధితులకు కూడా కంపెన్షషన్ ఇచ్చాం. చంద్రబాబు దాని గురించి ఆలోచించలేదు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. ప్రభుత్వం జీవో నెం 1 విడుదల చేసింది. అంతకుముందే పలమనేరు డివిజన్‌లో పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

చదవండి: (వారిద్దరికంటే తుగ్లక్‌లు రాష్ట్రంలో ఎవరూ లేరు: దాడిశెట్టి రాజా)

మరిన్ని వార్తలు