ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా పెండ్ర వీరన్న 

18 Oct, 2020 16:15 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పెండ్ర వీరన్న ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పెండ్ర వీరన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సంచార జాతులకు చెందిన వ్యక్తిని స్టేట్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు  అనడానికి ఇదే నిదర్శనం. ప్రజా సంకల్ప యాత్రలో సంచార జాతులకు వైభవం తీసుకు వచ్చే కార్యక్రమాలు చేపడతాం అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే సంచారజాతులకు న్యాయం జరిగే విధంగా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుంది. గత ప్రభుత్వాలు బీసీ కులస్తులను మభ్యపెట్టి మోసం చేశారు. నాపై నమ్మకంతో పదవి కట్టబెట్టిన సీఎం జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి వన్నె తెస్తాను. అని పేర్కొన్నాడు.

బీసీ కార్పొరేషన్ల ద్వారా అన్ని సామాజిక వర్గాల్లో అభివృద్ధి చేస్తాం.. సీఎం జగన్ మోహన్ రెడ్డి కలలు నిజం చేస్తాం అని విశాఖ జిల్లాకు చెందిన బీసీ కార్పొరేషన్ చైర్మన్లు తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ బీసీ కార్పొరేషన్ చైర్మన్ లను సీఎం జగన్ ప్రకటించడం పట్ల విశాఖ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు సంబంధించి మొత్తం ఐదుగురు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కే వీళ్ళు ముగ్గురు మహిళలు. తద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళల అభివృద్ధి ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదాన్ని రుజువు చేశారని పేర్కొన్నారు ఈ మేరకు చైర్మన్ పదవులు దక్కిన నేతలు తమ సామాజిక వర్గం అభివృద్ధి అన్ని రకాలుగా పనిచేస్తామని అన్నారు. తాజాగా కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం పట్ల హర్షం తోపాటు బాధ్యతాయుతంగా పనిచేస్తానని మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు