97.86% పింఛన్ల పంపిణీ 

5 Sep, 2022 05:34 IST|Sakshi
చికిత్స నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బళ్లారి వెళ్లిన బసివి గిరెమ్మకు పింఛన్‌ అందజేస్తున్న కర్నూలు జిల్లా నెరణి గ్రామ వలంటీర్‌ కాళమ్మ

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల సొమ్మును పంపిణీ చేశారు. మొత్తంమ్మీద గత నాలుగు రోజులుగా 60,98,340 మంది లబ్ధిదారులకు రూ.1,550.59 కోట్లు పింఛన్ల రూపంలో పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 97.86 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తయిందని సెర్ప్‌ అధికారులు ఆదివారం తెలిపారు. మిగతా వారి కోసం సోమవారం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు