కొనసాగుతున్న 'వైఎస్ఆర్ పెన్షన్ కానుక' పంపిణీ

1 Aug, 2021 18:04 IST|Sakshi
విజయవాడ భవానీపురం ప్రాంతంలో పెన్షన్లు పంపిణీ

60.50 లక్షల మందికి పింఛన్ల పంపిణీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 'వైఎస్ఆర్ పెన్షన్ కానుక' పంపిణీ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచే వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా 60,50,377 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.1455.87 కోట్లు కేటాయించింది. 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.

వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. ఇంటి వద్దకే పెన్షన్‌ చేరుతుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 77.03 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయ్యింది. నేటి నుంచి మూడు రోజుల పాటు పింఛన్ల పంపిణీ జరుగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు