టీడీపీ బంద్‌ పిలుపును పట్టించుకోని ప్రజలు

20 Oct, 2021 11:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ బంద్ పిలుపును ప్రజలు పట్టించుకోలేదు. కొంతమంది కార్యకర్తల హడావుడి తప్ప స్పందన కరవైంది. టీడీపీ నేత పట్టాబి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో బంద్‌ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. బంద్‌కు మద్దతు ఇవ్వలేమని వ్యాపార, విద్యాసంస్థలు స్పష్టం చేశాయి. ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. టీడీపీ బంద్ వల్ల ప్రజలకు ఉపయోగం లేనందున బంద్‌కు సహకరించలేమని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది.

 

మరిన్ని వార్తలు