Photo story: ఆట కట్టు!

14 Jun, 2021 09:58 IST|Sakshi

అనంతపురం: కరోనా సమయంలోనూ యథేచ్ఛగా తిరుగుతూ గుంపులుగా చేరుతూ మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్న యువకుల ఆటకట్టించారు త్రీటౌన్‌ పోలీసులు. ఆదివారం ‘సాక్షి’లో కరోనాతో ఆటలా శీర్షికన వెలువడిన కథనంపై స్పందించారు.

యువకులను చెదరగొడుతున్న త్రీటౌన్‌ సీఐ రెడ్డప్ప  
 

నేషనల్‌ పార్కు సమీపంలో ఆటలాడుతున్న యువకులను చెదరగొట్టారు. వైరస్‌ ఉధృతంగా ఉన్న సమయంలోనూ క్రమశిక్షణ పాటించకుంటే ఎలా అంటూ హెచ్చరించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇంట్లో పెద్దవాళ్లను ప్రమాదంలో పడేయొద్దని సీఐ రెడ్డప్ప సూచించారు. 
– సాక్షి, ఫొటోగ్రాఫర్

పోలీసుల రాకతో పరుగు పెడుతున్న యువకులు  


 


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు