ఆ వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్‌

5 Sep, 2020 04:59 IST|Sakshi

మార్చి 31 నాటికి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ జరిగిన బీఎస్‌–4 వాహనాలకు వర్తింపు 

ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు

సాక్షి, అమరావతి: సుప్రీం ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 నాటికి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేసుకున్న బీఎస్‌–4 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల్లో టీఆర్‌ (టెంపరరీ రిజిస్ట్రేషన్‌) జరిగిన వాటికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని రవాణా అధికారులు సూచించారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 30న పెండింగ్‌లో ఉన్న బీఎస్‌–4 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే వీటిలో కొన్ని వాహనాలకు వాహన యజమాని సెకండ్‌ వెహికల్‌ ట్యాక్స్‌ కట్టాల్సి ఉంది. వీటి రిజిస్ట్రేషన్‌ కార్డు, ఈ వాహనాలపై ఇతర ట్రాన్సాక్షన్స్‌ను రవాణా అధికారులు నిలిపి ఉంచారు. మళ్లీ ఇప్పుడు టీఆర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని శాశ్వత రిజిస్ట్రేషన్‌ లేని బీఎస్‌–4 వాహనాలకు ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించారు. 

► సెకండ్‌ వెహికల్‌ ట్యాక్స్‌ను  ్చpట్ట్చఛిజ్టీజ్డీ్ఛn. ్ఛpట్చజ్చ్టజిజీ.ౌటజ ద్వారా చెల్లించాలి. 
► ట్యాక్స్‌ చెల్లించిన వెంటనే ఈ వివరాలు రవాణా అధికారులకు తెలియజేస్తే ఆ వాహనంపై పెట్టిన లాక్‌ రిలీజ్‌ చేసి రవాణా అధికారులు ఆర్‌సీ పంపుతారు. 
► రవాణా శాఖ అన్ని రకాల సేవల్ని గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ అందుబాటులోకి తెచ్చింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు