బ్రహ్మోత్సవాల నుంచి నడకదారిలో భక్తులకు అనుమతి

30 Sep, 2021 04:40 IST|Sakshi

టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి వెల్లడి

తిరుమల: శ్రీవారి దర్శనం చేసుకునే సామాన్య భక్తుల కోసం నిర్మిస్తోన్న నడక దారి పైకప్పు పనులు పూర్తయ్యాయని టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల నుంచి నడకదారిలో భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు. అలిపిరి నుంచి తిరుమల వరకు జరుగుతోన్న నడక దారి పైకప్పు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. తొలగించిన కాంక్రీట్‌ వ్యర్థాలను త్వరితగతిన తొలగించాలని అధికారులను ఆదేశించారు. 

1న డయల్‌ యువర్‌ ఈవో
డయల్‌ యువర్‌ టీటీడీ ఈవో కార్యక్రమం అక్టోబర్‌ 1న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు జరగనుంది. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవోకి ఫోన్‌ ద్వారా తెలపవచ్చు. ఇందుకుగాను 0877–2263261 నంబర్‌ను సంప్రదించాలి. 

మరిన్ని వార్తలు