సోమశిల వద్ద తాగుబోతుల వీరంగం

20 Sep, 2020 21:53 IST|Sakshi

సాక్షి, నెల్లూరు‌: సోమశిల వరద నీటిలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. పెన్నా నదికి వస్తున్న వరద ఉదృతితో సోమశిల రిజర్వాయర్ పది గేట్లు ఎత్తి లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. దీంతో నీటి ప్రవాహం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సోమశిల రిజర్వాయర్ ముందు మందు బాబులు చిందులేశారు. ప్రవాహ వేగం తీవ్రంగా ఉన్న చోట ముగ్గురు తాగుబోతులు నీటి దగ్గరకు  వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా మరింత ముందుకు వెళ్ళివుంటే ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. అయితే డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు. 

మరిన్ని వార్తలు