దేవినేని ఉమను పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్‌

30 Jul, 2021 16:44 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎస్సీ, ఎస్టీ వేధింపులకు సంబంధించి కోర్టులో డీఎస్పీ పిటిషన్‌ దాఖలు చేశారు. దేవినేని ఉమను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దేవినేని ఉమ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌లో కోర్టును కోరారు.

ప్రశాంతంగా ఉన్న కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. తన అనుచరులను, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గడ్డమణుగు గ్రామస్తులపై దాడి చేయించిన ఉమాకు మైలవరం కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన సంగతి విదితమే.

మరిన్ని వార్తలు