ఆస్తి పన్ను మదింపు చట్టంపై హైకోర్టులో పిటిషన్‌

29 Sep, 2021 05:12 IST|Sakshi

ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి పన్నును భూములు, భవనాల అద్దె విలువ ఆధారంగా కాకుండా వాటి మూలధన విలువ ఆధారంగా మదింపు చేసేందుకు వీలు కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టంతో పాటు తదనుగుణ జీవోను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, కృష్ణా జిల్లా కలెక్టర్‌ తదితరులకు నోటీసులిచ్చింది.

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నవంబర్‌ 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వీరాంజనేయులు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. 

మరిన్ని వార్తలు