సీజేఐకి లేఖపై పిటిషన్లు మరో ధర్మాసనానికి

17 Nov, 2020 04:21 IST|Sakshi

జస్టిస్‌ లలిత్‌ ఆదేశాలు  

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖ బహిర్గతం కావడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందంటూ న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌గౌడ్, స్వచ్ఛంద సంస్థ యాంటీ కరప్షన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సునీల్‌ కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చాయి.

అయితే గతంలో తాను న్యాయవాదిగా ఉండగా వాద, ప్రతివాదుల్లో ఒకరి తరఫున ప్రాతినిధ్యం వహించినందున ప్రస్తుత కేసులో వాదనలు వినలేనని జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి సూచించిన మరో ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయాలని రిజిస్ట్రీని జస్టిస్‌ లలిత్‌ ఆదేశించారు. 

>
మరిన్ని వార్తలు