ఒప్పందం ఆధారంగా ఫీజుల ఖరారు చెల్లదు

23 Jan, 2021 05:16 IST|Sakshi

పీజీ మెడికల్, డెంటల్‌ కోర్సుల ఫీజుల పెంపుపై గత ప్రభుత్వ జీవోలు రద్దు చేసిన హైకోర్టు

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ మెడికల్, డెంటల్‌ కాలేజీల్లో పీజీ మెడికల్, డెంటల్‌ కోర్సుల వార్షిక ఫీజులను  భారీగా పెంచుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం 2017లో జారీ చేసిన జీవో 72, 77లను హైకోర్టు రద్దు చేసింది. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలతో కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం ఫీజులను నిర్ణయించడాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం మూడు రోజుల క్రితం తీర్పు వెలువరించింది. ఫీజుల పెంపుపై అప్పట్లో హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

ఈ వ్యాజ్యాలపై తుది విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఏకాభిప్రాయం ప్రకారమే ఫీజులను పెంచడం జరిగిందని, ఇందులో ఎలాంటి తప్పులేదన్న మెడికల్‌ కాలేజీల వాదనను తోసిపుచి్చంది. 2017–18 నుంచి 2019–20 సంవత్సరాలకు ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసులు లేకుండా ప్రభుత్వం నేరుగా ఫీజులు పెంచిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపింది.  

మరిన్ని వార్తలు