ఇవిగో ఈత పళ్లు 

21 Jun, 2022 19:58 IST|Sakshi

గిరిజన ప్రాంతాల్లో ఈత పళ్ల సీజన్‌ ప్రారంభమైంది. మైదాన ప్రాంతాల్లో ఈత చెట్లు పెద్దవిగా ఉండడంతో పాటు పండ్ల పరిమాణం పెద్దవిగానే ఉంటాయి. ఏజెన్సీలో మాత్రం చిన్న మొక్కల మాదిరిగా ఈత చెట్లు ఉండగా వాటికి కాసే పండ్లు పరిమాణం కూడా చిన్నవిగా ఉంటాయి. జి.మాడుగుల, జి.కె.వీధి, పాడేరు, హుకుంపేట, పెదబయలు, అరకులోయ, అనంతగిరి మండలాల్లో ఈతచెట్లు అధికంగా ఉన్నాయి.

ఈత చెట్లు ఉన్న కొండల్లో వేరే వృక్ష జాతి ఏమి ఉండవు. గిరిజనులు ఈత మొక్కల నుంచి బొడ్డెంగులు తవ్వి తింటుంటారు. ఈ సీజన్‌లో మాత్రం ఈత పండ్లను సేకరించి ఇంటిల్లపాది తినడంతో పాటు వారపు సంతలు, మండల కేంద్రాల్లో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఈత పళ్ల సీజన్‌ కావడంతో గిరిజనులు వాటిని సేకరించి అమ్మకాలు జరుపుతున్నారు. విద్యాలయాలకు వేసవి సెలవులు కావడంతో గిరిజన చిన్నారులు కూడా ఈ పళ్లను సేకరిస్తున్నారు. గ్లాస్‌ రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు.                  
–సాక్షి, పాడేరు

మరిన్ని వార్తలు