ఆస్తి పన్ను మదింపు విధానాన్ని మార్చండి

5 Sep, 2021 05:28 IST|Sakshi

హైకోర్టులో పిల్‌  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి పన్నును భూములు, భవనాల అద్దె విలువ ఆధారంగా కాకుండా.. వాటి మూలధన విలువ ఆధారంగా మదింపు చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం గతేడాది నవంబర్‌ 24న జారీ చేసిన జీవో 198, అదే రోజున జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది.

జీవో 198తో పాటు గెజిట్‌ నోటిఫికేషన్‌ను రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ ‘అవగాహన’ కార్యదర్శి కె.శివరామిరెడ్డి, మరో ముగ్గురు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. పాత విధానంలోనే ఆస్తి పన్ను వసూలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు