సీఎంకు పింగళి వెంకయ్య చరిత్ర పుస్తకం

18 Oct, 2020 04:32 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పింగళి వెంకయ్య చరిత్ర పుస్తకాన్ని అందజేస్తున్న ఆయన మనవడు గోపీకృష్ణ

మాచర్ల: త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన మనవడు గోపీకృష్ణ  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం అందజేశారు. తమ తాతయ్య 100 సంవత్సరాల క్రితం త్రివర్ణ పతాకం రూపకల్పన చేశారని, ఆయన ప్రయత్నాన్ని అన్ని వర్గాలకూ తెలిపేందుకు  తమ సోదరుడు జీవీఎన్‌ నరసింహం  పుస్తకాన్ని రచించారని గోపీకృష్ణ తెలిపారు.   

మరిన్ని వార్తలు