మంత్రి విశ్వరూప్‌కు గుండె శస్త్రచికిత్స విజయవంతం 

27 Sep, 2022 05:51 IST|Sakshi

ముంబైలో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ   

అమలాపురం టౌన్‌: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌కు ముంబైలోని ఏషియన్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించిన గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆయనకు గుండెలో ఆరు చోట్ల వాల్వులు బ్లాక్‌ అయ్యాయి. దీంతో వైద్యులు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేశారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ శస్త్రచికిత్స జరిగిందని మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణారెడ్డి తెలిపారు.

మంత్రి శస్త్రచికిత్స విజయవంతం కావాలని.. ఆయన తొందరగా కోలుకోవాలని అమలాపురం నియోజకవర్గంతో పాటు కోనసీమలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పార్టీ నాయకులు, అభిమానులు మోటార్‌ సైకిళ్ల ర్యాలీగా వెళ్లి పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మసీదులు, చర్చిలో ఆయా మత పెద్దలతో ప్రార్థనలు చేయించారు.   

మరిన్ని వార్తలు