ఒక గ్రామం.. ముగ్గురు ఎమ్మెల్యేలు

6 Feb, 2021 05:51 IST|Sakshi
కూర్మినాయుడు, రామస్వామినాయుడు, జగన్మోహనరావు

బొబ్బిలి రూరల్‌: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని పిరిడి గ్రామం రాజకీయంగా ప్రత్యేకతను సంపాదించుకుంది. ఈ గ్రామం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గ్రామానికి చెందిన కొల్లికూర్మినాయుడు 1952 నుంచి 1955వరకు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి బొబ్బిలి ఎమ్మెల్యేగా పనిచేశారు.

తిరిగి ఆయనే 1978నుంచి 1983 వరకు జనతాపార్టీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇదే గ్రామానికి చెందిన డాక్టర్‌ పెద్దింటి జగన్మోహనరావు కాంగ్రెస్‌పార్టీ తరఫున 1989 నుంచి 1994 వరకు. 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా వ్యవహరించారు. వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. డాక్టర్‌ జగన్మోహనరావు తండ్రి రామస్వామినాయుడు 1955నుంచి 1962 వరకు బలిజిపేట నియోజకవర్గానికి కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. 

మరిన్ని వార్తలు