ఏపీ రైతులు భళా.. నీతి ఆయోగ్‌ కథనాల్లో 21 మందికి స్థానం

16 May, 2022 14:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం ఆవశ్యకతను తెలుపుతూ నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సేంద్రియ వ్యవసాయదారుల స్ఫూర్తిదాయక కథనాల్లో 21 మంది ఏపీ రైతులకు స్థానం దక్కింది. వీరంతా వరి, వేరుశనగ, కందులు, ఉల్లిపాయలు, కూరగాయలు తదితర పంటలను సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించారు. సేంద్రియ వ్యవసాయంతో తమ ఆదాయం పెంచుకున్న వీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారంటూ నీతి ఆయోగ్‌ ‘కాంపెడియం ఆఫ్‌ సక్సెస్‌ స్టోరీస్‌ ఆఫ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌’ పేరిట దేశవ్యాప్తంగా 110 మంది కథనాలు ప్రచురించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 21 మంది ఉన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ సతీమణి, చీపురుపల్లి ఉప సర్పంచ్‌ బెల్లాన శ్రీదేవి కూడా వీరిలో ఉన్నారు.
చదవండి: ఇక్కట్లు లేని ‘ఇల’ పంటలు! 

ఏపీ రైతులు వీరే.. (ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన..)
చిర్తి నారాయణమూర్తి, పి.కొత్తగూడెం, నాతవరం, విశాఖ జిల్లా 
అనుగుల వెంకటసుగుణమ్మ, నాగమంగళం, పలమనేరు, చిత్తూరు జిల్లా 
బెల్లాన శ్రీదేవి, చీపురుపల్లి, విజయనగరం జిల్లా 
ఆర్‌.భాస్కర్‌రెడ్డి, ఎన్‌.గుండ్లపల్లి, బెలుగుప్ప, అనంతపురం జిల్లా 
చందు సత్తిబాబు, అమ్మపాలెం, పెదవేగి, పశ్చిమగోదావరి జిల్లా 
ఎస్‌.దిలీప్‌కుమార్, పెదకొండూరు, దుగ్గిరాల, గుంటూరు జిల్లా 
గమ్మెలి లక్ష్మి, ఐతగుప్ప, పాడేరు, విశాఖ జిల్లా
గెడ్డ అప్పలనాయుడు, గజపతినగరం, విజయనగరం జిల్లా  
హనుమంతు ముత్యాలమ్మ, కోసరవానివలస, పార్వతీపురం, విజయనగరం జిల్లా 
కంటిపూడి సూర్యనారాయణ, తీపర్రు, పెరపలి, పశ్చిమగోదావరి జిల్లా 
కిల్లో ధర్మారావు, రంగసిల, హుకుంపేట, విశాఖ జిల్లా  
కొత్తపల్లి శివరామయ్య, టి.కొత్తపల్లి, మైదుకూరు, కడప జిల్లా 
మాగంటి చంద్రయ్య, ఎన్‌.గొల్లపాలెం, మచిలీపట్నం, కృష్ణా జిల్లా 
మన్నేటి గంగిరెడ్డి, చెన్నమరాజుపల్లి, పెండ్లిమర్రి, వైఎస్సార్‌ జిల్లా 
ముప్పాల నిర్మలమ్మ, అరిమేనుపాడు, ఓజిలి, నెల్లూరు జిల్లా 
వై.పద్మావతమ్మ, లొడ్డిపల్లి, ఓర్వకల్లు,కర్నూలు జిల్లా 
బి.రామకోటేళ్వరరావు, గ్రామనపల్లె, కలసపాడు, వైఎస్సార్‌ జిల్లా 
శ్యాం రఘునాథ్, బంగారుపేట, బుచ్చయ్యపేట, విశాఖ జిల్లా  
బి.శ్రీనివాసరావు, కొణితివాడ, వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా  
కె.వెంకటరమణ, దుద్దుకూరు, దేవరపల్లి, పశ్చిమగోదావరి జిల్లా 
టి.యామిని, ఇన్నుగుంట, ఓజిలి, నెల్లూరు జిల్లా   

మరిన్ని వార్తలు