రాష్ట్ర భద్రతా కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు చోటు

17 Nov, 2020 04:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర భద్రతా కమిషన్‌లో ప్రతిపక్ష నేతకు చోటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిబంధనలు సవరిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏపీ రాష్ట్ర భద్రతా కమిషన్‌ నిబంధనలు–2020లోని రూల్‌ నంబర్‌–2లోని సబ్‌ రూల్‌–2లో ప్రభుత్వం సవరణ చేసింది.

రాష్ట్ర హోంమంత్రి చైర్మన్‌గా ఉండే ఈ కమిషన్‌లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి సభ్యులు. స్వచ్ఛంద సంస్థలు, పలు రంగాల నుంచి మరో అయిదుగురు సభ్యులుగా ఉంటారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతకు చోటు కల్పించకపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు