నాని సినిమా తరహా ఘటన.. కబడ్డీ కూతకు వెళ్లి..

17 Jan, 2021 15:57 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : జిల్లాలో భీమిలి కబడ్డీ జట్టు సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్ధి జట్టుపై కూతకు వెళ్లిన ఆటగాడు అవుట్‌ అయిన తర్వాత తిరిగొస్తూ గుండెపోటు గురయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలి కబడ్డీ కోర్టులోనే మృతి చెందాడు. వల్లూరు మండలంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వల్లూరు మండలంలోని గంగాయపల్లి మోడల్‌ స్కూల్‌ ఆవరణలో ఆర్కే యువసేన  ఆధ్వర్యంలో శనివారం కబడ్డీ పోటీలు జరిగాయి. చెన్నూరు, తప్పెట్ల గ్రామాల జట్లు తలపడ్డాయి. ( గర్భంలోని శిశువు మాయం.. మహిళ ఆందోళన )

కొండపేటకు చెందిన నరేంద్ర ప్రత్యర్ధి జట్టుపై కూతకు వెళ్లాడు. అవుట్‌ అయిన తర్వాత వెనక్కు తిరిగొస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కబడ్డీ కోర్టులోనే ప్రాణాలు వదిలాడు. దీంతో నరేంద్ర సొంత గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు