కోవిడ్‌ బాధిత బాలలకు ప్రభుత్వం అండ

31 May, 2022 22:10 IST|Sakshi

పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్ట్రన్‌ ద్వారా కోవిడ్‌ బాధిత చిన్నారులకు సాయం

వర్చువల్‌ విధానంలో ప్రసంగించిన ప్రధాని మోదీ   

సాక్షి,శ్రీకాకుళం: కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి నిస్సహాయులుగా మారిన బాలలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసానిచ్చారు. కోవిడ్‌ బాధిత చిన్నారుల కోసం పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకం ద్వా రా అందించే సంక్షేమాల గురించి ఆయన సోమ వారం వర్చువల్‌ విధానంలో ప్రసంగిస్తూ వివరించారు. జిల్లా కేంద్రం నుంచి ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి విశ్వేశ్వర తుడు, కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్, శాసన మండలి సభ్యులు పీవీఎన్‌ మాధవ్‌ పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోవిడ్‌ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సమగ్ర సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, అందుకే పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పథకం ఏర్పాటు చేశారని తెలిపారు. కలెక్టరేట్‌లో వర్చువల్‌ విధానంలో పీఎం ప్రసంగం వి న్న అనంతరం ఆయన మాట్లాడారు. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడం ఈ పథకం లక్ష్యమని తెలిపా రు. ఇలాంటి పిల్లలను గుర్తించాక చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ(సీబ్ల్యూసీ) ముందు హాజరు పరిచామని, వారు వివరాలను ధ్రువీకరించాక పీఎం కేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ పోర్టల్‌లో పిల్లల వివరాలతో పాటు డీఎం పరిశీలన కోసం అప్‌లోడ్‌ చేస్తారన్నారు. జిల్లాలో ఇలాంటి చిన్నారులు తొమ్మిది మంది ఉన్నారని, వారి గురించి ఒక్కొక్కరికి ఒక్కో ఫోల్డర్‌ కేటాయించామని తెలిపారు.

అందులో పోస్టాఫీసు పాస్‌ బుక్, ముఖ్య మంత్రి సందేశ పత్రం, ధ్రువీకరణ పత్రం ఉంటాయన్నారు. వీరికి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్య ను అందించడంతోపాటు పుస్తకాలు, దుస్తులు కూ డా అందిస్తామన్నారు. నెలవారీ స్టై ఫండ్‌ రూపంలో రూ.4000లు వరకు అందజేస్తామన్నారు. ఈ పథకాలు పొందేందుకు పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేదన్నారు. కలెక్టర్‌ అందరికీ బాధ్యత తీసుకుంటారని పేర్కొన్నారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ మాట్లాడుతూ ఇలాంటి చిన్నారులు ఏ సమస్య వచ్చి నా తనను సంప్రదించాలన్నారు. సమస్యలు గ్రీవెన్స్‌కు తెలియజేస్తే 15 రోజులు లేదా నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. వెబ్‌సైట్‌ ద్వారా సమస్యలు తెలియజేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని చె ప్పారు. ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ మాట్లాడుతూ పథకం మంచి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్బంగా మంత్రి విశ్వేశ్వర తుడుని కలెక్టర్, ఎస్పీ దుశ్శాలువ, పుష్పగుచ్ఛంతో సన్మానించారు.

మరిన్ని వార్తలు