భూదేవి పేట భేష్‌.. అభినందించిన ప్రధాని మోదీ

3 Oct, 2021 12:05 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానమంత్రి ప్రసంగాన్ని వింటున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శివానందకుమార్, తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు

గ్రామంలో ఇంటింటా మంచినీటి కొళాయి  

ఆర్‌డబ్ల్యూఎస్‌  ఎస్‌.ఈ కె.శివానంద కుమార్‌

సాక్షి, గజపతినగరం:  విజయనగరం జిల్లాలో మంచినీటి సదుపాయం, స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో మండలంలోని భూదేవి పేట స్పందన కలిగిన గ్రామంగా ఎంపికైందని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌.ఈ కె.శివానంద కుమార్‌ తెలిపారు. శనివారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలజీవన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రామంలో ఉన్న 144 కుటుంబాలకు పూర్తిగా మంచి నీటి కొళాయి కనెక్షన్‌ ఇచ్చామని తెలిపారు.

సమావేశానికి హాజరైన డీపీఓ సుభాషిణి గ్రామాన్ని ఒకసారి పరిశీలించి పచ్చదనం పరిశుభ్రత, మంచినీటి కనెక్షన్లలో ముందంజలో ఉండడంతో భూదేవి పేట గ్రామ సర్పంచ్‌ కనకల ప్రవీణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బందిని అభినందించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూదేవి పేట గ్రామాన్ని అభినందిస్తూ చేసిన ప్రసంగాన్ని అధికారులతో పాటు గ్రామస్తులు విన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అరుణ కుమారి, ఎంపీడీఓ కిశోర్‌ కుమార్‌ ఎంపీపీ బెల్లాన జ్ణానదీపిక, సర్పంచ్‌ కె.ప్రవీణ, వైఎస్సార్‌సీపీ జిల్లా యూత్‌ ప్రధాన కార్యదర్శి కనకల సుబ్రహ్మణ్యం, సీనియర్‌ నేతలు బెల్లాన త్రినాథరావు, మండల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: (ఈసీ గంగిరెడ్డి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్)  

మరిన్ని వార్తలు