ప్రధాని పర్యటన.. వైజాగ్‌లో ట్రాఫిక్ ఆంక్షలివే

12 Nov, 2022 07:14 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ వైజాగ్‌ పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు అవుతున్నాయి. ప్రధాని సభ సందర్భంగా 8,600 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు. ఏయూ సభా ప్రాంగణం వద్ద ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. 

ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ పరిసరాల్లో ఈ రోజు సాధారణ వాహనాల రాకపోకల నిషేధం విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 వరకు శ్రీకాకుళం విజయనగరం నుంచి విశాఖ మీదుగా వెళ్లే వాహనాలు ఆనందపురం సబ్బవరం మీదుగా మళ్లిస్తారు.

► అనకాపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్లే వాహనాలు లంకెలపాలెం సబ్బవరం పెందుర్తి మీదగా మళ్లింపు ఉంటుంది.

► శనివారం మధ్యాహ్నం మూడు వరకు మద్దిలపాలెం, ఆంధ్ర యూనివర్సిటీ .. పెదవాల్తేరు . కురుపాం సర్కిల్... స్వర్ణ భారతి స్టేడియం.. పరిసరాల్లో పూర్తిగా సాధారణ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.

 అలాగే జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ కు సెలవు ప్రకటించిన మార్కెట్ కమిటీ. 

ప్రధాని సభకు మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 8 నుంచి 11 మధ్య అత్యవసరమైతే బయటకు రండి. ఆ సమయంలో ప్రధాని సభకు వెళ్లే ప్రజల వాహనాలకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రధాని సభకు వెళ్లే వాహనాలకు రూట్ మ్యాప్ ఇచ్చాం..వీటిని కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉంటాం. ప్రధాని సభకు వెళ్లే వీఐపీలకు గ్రీన్ ఛానల్ రూట్ ఏర్పాటు చేసినట్లు సీపీ శ్రీకాంత్‌ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు