పోలవరం ప్రాజెక్టుకు రూ.745.94 కోట్లు

9 May, 2021 09:30 IST|Sakshi

విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు  

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగకుండా చూడటంతో పాటు.. మరింత వేగవంతం చేయడానికి రూ.745.94 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులకు 2021–22 బడ్జెట్‌లో త్రైమాసిక ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్‌ రావత్‌ శనివారం ఉత్తర్వులిచ్చారు.

పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గోదావరికి వరదలు వచ్చేలోగా చేయాల్సిన పనులను శరవేగంగా పూర్తి చేయడం కోసం.. నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. నిర్వాసితులకు వీలైనంత వేగంగా పునరావాసం కల్పించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే నిధులు విడుదల చేసింది.

చదవండి: World Bank: మిగతా రాష్ట్రాల కంటే ఏపీ బెస్ట్‌   
అర్ధరాత్రి హైవేపై.. సినిమాను తలపించే రీతిలో

మరిన్ని వార్తలు