పరుగులు పెడుతున్న ‘పోలవరం’ పనులు

29 Jan, 2021 09:08 IST|Sakshi

పోలవరం రూరల్‌: అధునాతన సాంకేతికతతో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే గేట్ల అమరిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలో గేట్లకు సిలిండర్లు,  పవర్‌ ప్యాక్‌లను అమర్చుతారు. స్పిల్‌ వే పిల్లర్స్‌కు 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 25 గేట్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. ఒక్కో గేటుకు రెండు హైడ్రాలిక్‌ సిలిండర్లు ఏర్పాటు చేస్తారు. వీటిని జర్మనీలో తయారు చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి 70 హైడ్రాలిక్‌ సిలిండర్లను తరలించారు. మరో 26 జర్మనీ నుంచి రావాల్సి ఉంది. స్పిల్‌ వే బ్రిడ్జి మొత్తం 1,128 మీటర్లు నిర్మించాల్సి ఉండగా.. 1,000 మీటర్ల బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యాయి. చదవండి: విద్వేషాలకే వింత రాజకీయం

స్పిల్‌ వే పిల్లర్స్‌పై 192 గడ్డర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 180 ఏర్పాటు చేశారు. స్పిల్‌ వే పిల్లర్స్‌ 55 మీటర్ల ఎత్తు నిర్మించాల్సి ఉండగా.. 54.5 మీటర్ల ఎత్తుకు చేరాయి. స్పిల్‌ వే, స్పిల్‌ వే బ్రిడ్జి, స్పిల్‌ చానల్‌ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే కాఫర్‌ డ్యామ్‌ను ఎత్తు చేసే పనులు, పవర్‌ హౌస్‌ నిర్మాణం, గ్యాప్‌–1, గ్యాప్‌–2, గ్యాప్‌–3 పనులు వేగంగా జరుగుతున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా ఇంజినీరింగ్‌ ప్రణాళికలు రూపొందించారు. చదవండి: సెన్సూర్‌ అధికారం ఎస్‌ఈసీది కాదు

మరిన్ని వార్తలు