దేవుడిలా ఆదుకున్న పోలీస్‌.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ ప్రశంసలు

27 Nov, 2021 10:21 IST|Sakshi

సాక్షి, అనంతపురం: జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‌ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గూటి పోలీస్‌ స్టేషన్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మారుతీ ప్రసాద్ ఓ అభాగ్యురాలిపట్ల మానవత్వం చూపించారు. అనంతపురం హైవే రోడ్డులో చలితో వణుకుతున్న మహిళకు తన వింటర్‌ జాకెట్‌ని అందించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెకు నగదు సాయం చేయడంతో పాటు అనాథ శరణాలయంలో చేర్చి  మారుతీ ప్రసాద్‌ తన మానవత్వాన్ని చాటుకున్నారు.

కానిస్టేబుల్‌ దాతృత్వానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మారుతీ ప్రసాద్‌ని ప్రశంసించారు.

మరిన్ని వార్తలు