బెట్టింగ్‌లపై పోలీస్‌ బెత్తం

8 Nov, 2020 03:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: సమాజంలో వ్యసనంగా మారిన ఆన్‌లైన్‌ గేమ్‌లు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లపై సర్కారు ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వీటిని నిషేధించింది. ఇదే విషయమై కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు కొద్ది రోజుల క్రితం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ గేమ్‌లు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లు నిర్వహించే 135 వెబ్‌సైట్‌లపై ఆన్‌లైన్‌ నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో వైఎస్‌ జగన్‌ కోరారు.

సీఎం ఆదేశాలతో బెట్టింగ్‌లపై పోలీసులు బెత్తం ఝుళిపిస్తున్నారు. ఇటీవల కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేసి క్రికెట్‌ బుకీలను అరెస్ట్‌ చేశారు. క్లబ్‌లు, కల్చరల్‌ క్లబ్‌లు, అతిథి గృహాల్లో పేకాట, కోతాట, గ్యాంబ్లింగ్‌ వంటివి నిర్వహించకుండా నోటీసులు ఇవ్వడంతో అవి మూతపడ్డాయి. పోలీసులు హెచ్చరించినా వినకుండా వాటిని నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. ఫలితంగా గత ఐదేళ్ల కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు