నూజివీడులో ఆకస్మిక తనిఖీలు..

6 Aug, 2020 12:36 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: నూజివీడు మెడికల్ షాపుల్లో గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మందు బాబులు ఈ మధ్య కాలంలో శానిటైజర్లు సేవించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెడికల్‌ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. శానిటైజర్లు అధికంగా కొనుగోలు చేసే వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. శానిటైజర్ల అమ్మకానికి ప్రత్యేక రికార్డు మెయింటెన్ చేయాలని షాపుల యజమానులకు పోలీసులు సూచించారు.

ప్రకాశం: జిల్లాలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, మార్కాపురం డ్రగ్‌ ఇన్స్పెక్టర్‌ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురువారం ఉదయం పొదిలి మెడికల్‌ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేని శానిటైజర్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా