కాకినాడ: బీజేపీ ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలు.. పార్టీ నేతలపై కేసు నమోదు

28 Jul, 2022 13:29 IST|Sakshi

సాక్షి, కాకినాడ: జిల్లాలోని తునిలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. దీంతో కాషాయ పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తునిలోని బీజేపీ ఆఫీసులో అసాంఘిక కార్యక​‍లాపాలు జరుగుతున్నట్టు ఫిర్యాదు అందడంతో బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.

వివరాల ప్రకారం.. తుని పట్టణ శివారులోని మాన్విత అపార్ట్‌మెంట్‌లో బీజేపీ కార్యాలయం ఉంది. కాగా, బుధవారం రాత్రి బీజేపీ నేతలు మద్యం మత్తుల్లో అపార్ట్‌మెంట్‌వాసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో, గురువారం అపార్ట్‌మెంట్‌లోని నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు.. బీజేపీ ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఆరోపణలు చేశారు. దీంతో, బీజేపీ నేతలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: ప్యాకేజీకి అంగీకరించిన మీరే ఇప్పుడు హోదా అడుగుతారా

మరిన్ని వార్తలు