ప్రభుత్వ ఆస్తుల జోలికి వెళ్తే కఠిన చర్యలు: డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి

17 Jun, 2022 21:18 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. తాజాగా డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు.. ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.  విజయవాడ, గుంటూరు, అనకాపల్లి, విశాఖపట్నం, తిరుపతిలో హైసెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

పరిస్థితులను సమీక్షించుకుంటూ రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ పలు చర‍్యలు చేపట్టినట్టు స‍్పష్టం చేశారు. రైళ్లలో అనుమానితులను అదుపులోకి తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్తుల జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు కేసుల్లో ఇరుక్కుంటే అనంతరం ఏ ఉద్యోగమూ రాదంటూ వార్నింగ్‌ ఇచ్చారు. అబద్ధపు ప్రచారాలు, పుకార్లు పుట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఇది కూడా చదవండి: ఎక్కడికక్కడ ఆందోళనకారులు అరెస్ట్‌

మరిన్ని వార్తలు