సైబర్‌ అలర్ట్‌: ఓటీపీ.. చెప్పకపోతేనే హ్యాపీ!

28 Jul, 2021 19:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ నుంచి పార్సిల్‌ వచ్చిందంటూ ఫోన్‌

బుక్‌ చేయలేదంటే క్యాన్సిల్‌ కోసం ఓటీపీ చెప్పాలని కోరుతున్న వైనం

ఓటీపీ చెప్పిన వెంటనే ఖాతాల్లో నగదు మాయం 

శ్రీకాకుళం: సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర లేపారు. ఇప్పటివరకు రకరకాలుగా ప్రజలను మోసం చేస్తుండ గా అవి పోలీసుల దృష్టికి రావడం, వాటిపై దృష్టి సారించి దర్యాప్తులు చే స్తుండడంతో జనాలను దోచుకోవడానికి కొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారాలకు ఉన్న ఆదరణను చూసి దీనిపై దృష్టి సారించి ప్రజలను మభ్య పెడుతున్నారు. వీటిపై సైబర్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. 
ఎలా మోసగిస్తారు..? 
వినియోగదారులకు ఫోన్‌ చేసి మీకు అమెజాన్‌ నుంచి లేదా ఫ్లిప్‌కార్ట్‌ నుంచి పార్సిల్‌ వచ్చిందని, దాన్ని ఎక్కడ డెలివరీ చేయాలని అడుగుతారు. తాము ఎలాంటి పార్సిల్‌ను బుక్‌ చేయలేదని చెబితే.. దాన్ని క్యాన్సిల్‌ చేస్తామని, అందుకు గాను మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీని చెప్పాలని కోరుతున్నారు. దీంతో వినియో గదారుడు ఎలాంటి అనుమానం పడకుండా తమకు వచ్చిన ఓటీపీని చెబుతుండడంతో అప్పటికే ఆ ఫోన్‌ నంబర్‌కు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి క్షణాల్లో డబ్బు మాయమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. 

ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండి ఓటీపీలను ఏ ఒక్కరికీ చెప్పకుండా ఉంటే సైబర్‌ నేరగాళ్ల ఉ చ్చులో పడకుండా ఉండేందుకు వీలవుతుందని పో లీసులు సూచిస్తున్నారు. బ్యాంకులు గానీ, మరే సంస్థలు గానీ నేరుగా ఫోన్‌ ద్వారా ఓటీపీలు, సీవీవీలు, ఏటీఎం కార్డు నంబర్లు అడగవని వారు చెబుతున్నారు. కేవలం సైబర్‌ నేరగాళ్లు మాత్రమే ప్రజలను ఏమారుస్తూ నేరాలకు పాల్పడుతున్నారని, ఓసారి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడితే తిరిగి వాటిని రాబట్టడం అంత సులభంగా అయ్యే పని కాదని అంటున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారు ఇతర రా ష్ట్రాల్లోనో, ఇతర దేశాల్లోనో ఉన్నవారు కావడంతో ఈ తరహా కేసులు పోలీసులకు సవాల్‌ విసురుతున్నాయి. సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసపూరిత ఫోన్‌కాల్స్, మెసేజ్‌ల ఉచ్చులో పడకుండా ఉండాలని సైబర్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో చెబుతున్నారు.    

మరిన్ని వార్తలు