ఏపీ: హెల్మెట్‌ లేని పోలీసులకు జరిమానా

4 Jul, 2021 19:27 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): జిల్లా కేంద్రంలో 27 మంది పోలీసులకు ట్రాఫిక్‌ విభాగం అధికారులు శనివారం జరిమానాలు విధించారు. జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బందరు ట్రాఫిక్‌ డీఎస్పీ భరత్‌మాతాజీ నగరంలో హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడిపే పోలీసులను పట్టుకునేందుకు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించారు. అన్ని ప్రధాన కూడళ్లతో పాటు పోలీసు క్వార్టర్స్‌ల వద్ద కాపు కాసి హెల్మెట్‌ లేకుండా రోడ్లపైకి వచ్చిన పోలీసులను పసిగట్టి మరీ పట్టుకున్నారు.

27 మంది హెల్మెట్‌ లేకుండా ప్రయాణించటాన్ని గమనించి అడ్డుకోవటంతో పాటు అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో జరిమానాలు విధించారు. మరో 100 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు. ఒక్క రోజులో హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న 27 మంది పోలీసులకు జరిమానాలు విధించిన భరత్‌మాతాజీని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చట్టానికి ఎవ్వరూ అతీతులు కారన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు