సీఎం జగన్‌ రుణం తీర్చుకోలేనిది: పాలిటెక్నిక్‌ అధ్యాపకులు

16 Jul, 2022 08:56 IST|Sakshi
సీఎం చిత్ర పటానికి పాలతో అభిషేకం చేస్తున్న పాలిటెక్నిక్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాఘవరెడ్డి  

పేస్కేల్‌–2016 అమలుపై పాలిటెక్నిక్‌ అధ్యాపకుల హర్షం

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

కడప(వైఎస్సార్‌ జిల్లా): ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో పనిచేసే బోధన సిబ్బందికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి పేస్కేల్‌–2016 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వటంపై పాలిటెక్నిక్‌ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కడప పాలిటెక్నిక్‌ కళాశాలలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
చదవండి: ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్‌ కాన్వాయ్‌ ఆపి.. 

పాలిటెక్నిక్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఈ పేస్కేల్‌ ద్వారా 84 ప్రభుత్వ పాలిటెక్నిక్, 2 ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పదవీ విరమణ చేసిన సుమారు 2,500 మంది లెక్చరర్లకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు