కాసులు కురిపించే పెరటికోళ్లు 

7 Nov, 2020 08:50 IST|Sakshi
రాజశ్రీ రకం కోళ్లు

లాభదాయకంగా మారుతున్న కోళ్ల పెంపకం

యువత స్వయం ఉపాధి మార్గంగా మారుతున్న తీరు 

విజయనగరం ఫోర్ట్‌: అందరికీ ఉద్యో గాలు అసాధ్యం. పంట పండించాలంటే ఎంతోకొంత పొలం ఉండాలి. ఇవే వీ లేని యువతకు ఓ చక్కని ఉపాధి మార్గం పెరటికోళ్ల పెంపకం. గ్రామీణ ప్రాంత రైతులే కాదు... పట్టణాల్లోని యువతకు కూడా ఇదో ఆదాయ వనరుగా మలచుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆదాయం పొందడానికి ఆస్కారం ఉండే ఈ తరహా వ్యాపకం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటి పెంపకంపై పశుసంవర్థకశాఖ జేడీ ఎం.వి.ఎ.నరసింహం పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. (చదవండి: ప్రాధేయపడినా కనికరించలేదు..

రాజశ్రీ రకానికి చెందిన కోళ్లు పెంచుకుంటే అధిక ఆదాయం వస్తోంది. ఈ కోళ్లు అధిక ఉత్పాదక శక్తి కల్గి ఉండి ఏడాదికి 160 నుంచి 180 గుడ్లు పెడతాయి. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుంటాయి.
వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. పోషణ ఖర్చు తక్కువ. సాధారణ నాటు కోళ్ల మాదిరిగానే ఉంటాయి.
వీటి గుడ్లు నాటు కోడి గుడ్లు కన్నా పెద్దవిగా ఉంటాయి. పుంజుల్లో ఎదుగుదల నాటుకోళ్లతో పోలిస్తే ఎక్కువగా ఉండి, అధిక బరువు కల్గి ఉంటాయి. ఇవి నాటు కోళ్లమాదిరి త్వరగా మనిషికి మచ్చిక అవుతాయి.
రాజశ్రీ రకానికి చెందిన కోళ్లకు పొదుగు లక్షణాలు లేకపోవడం వల్ల ఈ కోళ్ల నుంచి వచ్చే గుడ్లు నాటు కోడి కిందగానీ, ఇంక్యూబేటర్‌ ద్వారా గాని పొదిగించి పిల్లలు పొందవచ్చు.

కోడి పిల్లల సంరక్షణ:
నేలపై రెండు అంగుళాల మందంలో గుండ్రంగా వరి ఊకను గానీ వేరుశనగ తొక్కును గానీ పరిచి దానిపై ఒక పొర మందంగా పేపర్లు పరచాలి.
దానిపై ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉండే అట్ట ముక్క లు గానీ జీఐ షీట్లు గానీ అమర్చాలి. దీనిని చిక్‌ గార్డ్‌ అంటారు.
7 నుంచి 8 అంగుళాల వైశాల్యం ఉండే ప్రదేశం 250 కోడి పిల్లలు ఉండేందుకు సరిపోతుంది.
కోడి పిల్లలకు ఉష్ణోగ్రతను అందించేందుకు ఒక గొడు గు  వంటి దానిని నేలపై ఉంచి అడుగు ఎత్తులో వేలాడ దీసి దానికి ఒక కోడి పిల్లకు ఒక వాట్‌ చొప్పున లెక్కవేసి విద్యుత్‌ బల్బులు అమర్చాలి.
100 కోడి పిల్లలకు 100 వాట్‌ బల్బులు సరిపోతాయి.
మొదటగా పిల్లలను తెచ్చిన వెంటనే బీకాంప్లెక్స్‌ను కలిపిన నీటిని వేరుగా ఉంచి కోడి పిల్ల ముక్కులు దానిలో ముంచి తరువాత చిక్‌ గార్డ్‌లోకి వదలాలి.
పేపర్‌పైన నూకలాగా మరపట్టిన మొక్క జొన్నను పలుచగా చల్లాలి. మొదటి వారం అంతా 24 గంటలు బల్బు వెలుగుతూ ఉండేలా చూడాలి. రెండో వారం నుంచి ఉష్ణోగ్రత తగ్గించాలి.
దీనికోసం గొడుగును కొంచెం ఎత్తు పెంచడం గానీ బల్బు సామర్ధ్యం తగ్గించడం గానీ చేయాలి.
10వ రోజున పేపర్‌ తీసివేసి చిక్‌గార్డు సైజ్‌ పెంచాలి. క్రమేపీ వయస్సు పెరిగిన కొద్దీ చిక్‌ గార్డు వెడల్పు చేస్తూ రెండో వారం చివరిలోగాని మూడవ వారంలో పూర్తిగా తీసి వేయవచ్చు. అనంతరం చిక్‌ గార్డు నుంచి బయటకు తీసి స్వేచ్ఛగా మెల్లగా పెరటిలోకి అలవాటు చేయాలి.
పెరటి కోళ్లకు దాణా కోనాల్సిన అవసరం ఉండదు. ఇవి కీటకాలు, గింజలు లేత గడ్డి ఇంట్లో ఉండే వ్యర్ధ పదార్థాలను తిని బతుకుతాయి.
పెరట్లో దొరికే ఆహారాన్ని బట్టి నూకలు మొక్కజొన్న తవుడుతో తయారు చేసిన సమీకృత దాణాను కూడా కొద్దిగా అందించాలి. 
ఈ రకానికి చెందిన కోళ్లు 6 నెలల వయస్సు వచ్చేసరికి గుడ్డు పెట్టడం మొదలు పెడుతుంది. ఈ దశలో కాంతిని అందించడం అనేది ముఖ్యమైన చర్య. దీని కోసం గృహ వసతి అవసరం.
ఎంత కాంతి అందించాలి అనేది కాలాలను, వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. శీతా కాలం అయితే రాత్రి సమయాల్లో కాంతిని నాలుగు, ఐదు గంటలు పాటు, వేసవి కాలంలో రెండునుంచి 3 గంటలపాటు సూర్యాస్తమయం తరువాత అందించాలి.   

మరిన్ని వార్తలు