తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన వాన

14 Oct, 2020 07:45 IST|Sakshi

భారీ వర్షం: ప్రకాశం బ్యారేజ్‌కి పోటెత్తిన వరద నీరు

సాక్షి, అమరావతి‌: రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు, వర్షంగా కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు పోటెత్తుతోంది. గంట గంటకూ పెరుగుతున్న వరద ప్రవాహంతో  70 గేట్లు ఎత్తివేసినట్లు అధికారలు పేర్కొన్నారు. ఇన్‌ఫ్లో 5,29,020 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 5,25,854 క్యూసెక్కులు ఉంది. ఈస్ట్రన్‌, వెస్ట్రన్‌ కెనాన్స్‌కు 3,166 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.

నేటి ఉదయం 9.00 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. వరద ముంపు ప్రభావిత అధికారులను జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ అప్రమత్తం చేశారు. చంద్రర్లపాడు నుంచి ఇబ్రహీంపట్నం వరకు తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన లంక, పెద లంక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో 6,46,747, అవుట్‌ ఫ్లో 5,34,933 క్యూసెక్కులుగా కొనగసాగుతోంది.


 

తెలంగాణ:
హైదరాబాద్‌లో కుంభవృష్టి
హైదరాబాద్‌లో చెరువులను తలపిస్తున్న పలు కాలనీలు
వరద నీటిలో కొట్టుకుపోయిన కార్లు, ఆటోలు, బైక్‌లు
పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
సహాయక చర్యల్లో జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌, విపత్తు నిర్వహణశాఖ సిబ్బంది
హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపైకి భారీగా వరద నీరు

హైదరాబాద్‌లో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదు
ఘట్‌కేసర్‌-31.9 సెం.మీ, హయత్‌నగర్‌- 29.1 సెం.మీ వర్షపాతం
హస్తినాపురం-27.9 సెం.మీ, సరూర్‌నగర్‌- 26.7 సెం.మీ వర్షపాతం
అబ్దుల్లాపూర్‌మెట్‌-26.1 సెం.మీ, కీసర- 26 సెం.మీ వర్షపాతం
వలిగొండ- 25.5 సెం.మీ, ఇబ్రహీంపట్నం- 25.3 సెం.మీ వర్షపాతం
ఉప్పల్‌- 24.8 సెం.మీ, ముషీరాబాద్‌- 24.5 సెం.మీ వర్షపాతం
మేడిపల్లి-23.2 సెం.మీ వర్షపాతం నమోదు
చార్మినార్‌, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌లో 21.6 సెం.మీ వర్షపాతం

శ్రీకాకుళం:
జిల్లాలో పలుచోట్ల వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం
సమాచార సేకరణకు మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు
శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నం: 08942-240557
మెళియాపుట్టి మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న సాగరం గెడ్డ
సాగరం గెడ్డలో వరద ప్రవాహానికి యువకుడు గల్లంతు
వంశధార, నాగావళి నదులకు వచ్చి చేరుతున్న వరద నీరు
మడ్డువలస రిజర్వాయర్‌కు భారీగా వరద
ఇన్‌ఫ్లో 20,903 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 20,903 క్యూసెక్కులు

తూర్పుగోదావరి:
కాకినాడ నగరం జల దిగ్బంధం అయింది.
పంపా, తాండవ, ఏలేరు జలాశయాల్లోకి భారీగా వరద
సూరంపాలెం, మద్దిగడ్డ జలాశయాల్లోకి భారీగా వరద
లోతట్టు ప్రాంతాలు జలమయం, నీట మునిగిన పంటలు

విశాఖపట్నం:
జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం
ఎలమంచిలిలో అత్యధికంగా 15 సెం.మీ వర్షపాతం నమోదు

పశ్చిమగోదావరి:
తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద
తమ్మిలేరు జలాశయం నుంచి 16వేల క్యూసెక్కుల నీరు విడుదల
ఏలూరులో ఉధృతంగా ప్రవహిస్తున్న తమ్మిలేరు వాగు
తమ్మిలేరుకు పలుచోట్ల గండ్లు
ఏలూరు నగరాన్ని చుట్టుముట్టిన తమ్మిలేరు వరద
చాణక్యపురి, అశోక్‌నగర్, పొణంగి కాలనీల్లోకి భారీగా వరద
సహాయక చర్యలు చేపట్టిన రెవెన్యూ, పోలీసు సిబ్బంది
బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించిన అధికారులు

కృష్ణా:
జిల్లాలో పలుచోట్ల వర్షం
తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఉధృతంగా వరద
నూజివీడు, మైలవరం నియోజకవర్గాల్లో భారీగా వరద
వరదల ఉధృతితో పలు గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు

మరిన్ని వార్తలు