సిబ్బందే.. అటవీ సంరక్షకులు

12 Sep, 2021 05:08 IST|Sakshi
మాట్లాడుతున్న అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి ప్రతీప్‌ కుమార్‌

అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి ప్రతీప్‌ కుమార్‌  

సాక్షి, అమరావతి: అటవీ సంపదను కాపాడడంలో సిబ్బందిదే కీలకపాత్ర అని అటవీ శాఖ ముఖ్య ప్రధాన సంరక్షణాధికారి ఎన్‌ ప్రతీప్‌ కుమార్‌ అన్నారు. ఇప్పటికే  అటవీ సంపదను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేస్తున్నారని అభినందించారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గుంటూరులోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

అటవీ శాఖలో కొందరు ఉద్యోగులు అడవులను, అటవీ సంపదను కాపాడుతూ.. విధి నిర్వహణలో అసువులు బాసారని తెలిపారు. వారి కుటుంబాలను ఆదుకోవడంతోపాటు వారికి రావలసిన బెనిఫిట్స్‌ త్వరితగతిన అందజేస్తామని చెప్పారు. కోవిడ్‌ సమయంలో దురదృష్టవశాత్తూ 38 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని వారి  కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందించామని తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు