ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఇంతగా దిగజారాలా..?

29 May, 2022 08:31 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీటు కోసం నోటి దురుసు..! రాజకీయ గుర్తింపు కోసం నీచాతినీచంగా మాట్లాడాలా? బాస్‌ మెప్పు కోసం నోటికి పని చెప్పాలా..? అంటూ మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులే కాకుండా టీడీపీ వర్గాలు సైతం ఆమె వ్యాఖ్యల పట్ల విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. కావలి ప్రతిభాభారతి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాయకురాలిగా పేరు సంపాదించారు. ప్రస్తుతం విజయనగరంలో కలిసిపోయిన రాజాం నుంచి ఆమె ప్రాతినిథ్యం వహించారు. 

ప్రతిభాభారతి వారసురాలి గా గ్రీష్మ కొన్నాళ్లు ఇక్కడ హల్‌చల్‌ చేసినా ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఇన్నాళ్లూ ఉండి మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయనగా మళ్లీ జిల్లాకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఒంగోలు వేదికగా జరిగి న టీడీపీ మహానాడులో అసభ్య పదజాలంతో ప్రసంగించి అధినేత చంద్రబాబు దృష్టిలో పడడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రసంగంతో పాటు ఆమె వైఖరి కూడా సర్వత్రా విమర్శల పాలవుతోంది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెను సమర్థించలేకపోతున్నారు. ఉన్నత పద వులు అలంకరించిన కుటుంబానికి చెందిన వ్యక్తిగా.. హుందాగా వ్యవహరించాల్సిన మహిళ ఇలా నిండు సభలో నోటి కి అదుపు లేకుండా మాట్లాడడాన్ని అంతా ఖండిస్తున్నారు.  

టిక్కెట్‌ కోసమేనా ఇదంతా..? 
గ్రీష్మ తల్లి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నుంచి పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. రాజకీయంగా జిల్లాలో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. కాలక్రమేణా ఆమె రాజకీయంగా బలహీనమయ్యా రు. ఆ పార్టీలోని గ్రూపు తగాదాలు, నేతల మధ్య విభేదాల తో పట్టు కోల్పోయారు. ఈ క్రమంలో తల్లి స్థానాన్ని తాను భర్తీ చేయాలని గ్రీష్మ తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంగా ఉన్న రాజాం నుంచి పోటీ చే యాలని అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గం ఇప్పుడు వి జయనగరం జిల్లాలో ఉంది. అక్కడ టీడీపీలో తనకు పో టీగా కోండ్రు మురళీమోహన్‌ ఉండటం, ఆయనకు టిక్కె ట్‌ వస్తుందేమోనన్న అభద్రతాభావంతో ఇలా అధినేత దృష్టిలో పడడానికి పాట్లు పడుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

మరిన్ని వార్తలు