ప్రైవేట్‌ టీకా కేంద్రాల్లో 'ప్రికాషన్‌'

10 Apr, 2022 02:57 IST|Sakshi

నేటి నుంచి ప్రైవేట్‌ టీకా కేంద్రాల్లో ప్రికాషన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారికి ప్రైవేట్‌ టీకా కేంద్రాల్లో కోవిడ్‌ ప్రికాషన్‌ డోసు టీకా పంపిణీ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ప్రైవేట్‌ కేంద్రాల్లో ప్రికాషన్‌ డోసు పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. రెండో డోసు టీకా తీసుకుని 9 నెలలు పూర్తయిన వారందరూ ప్రికాషన్‌ టీకా వేసుకోవడానికి అర్హులు. తొలి రెండు డోసులు ఏ టీకా పొందారో ప్రికాషన్‌ డోసు కింద అదే రకం టీకా వేసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా 446 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టీకా పంపిణీకి గతంలో వైద్య శాఖ అనుమతి ఇచ్చింది. ఈ ఆస్పత్రులు టీకా తయారీ కంపెనీల నుంచి కొనుగోలు చేసి పంపిణీ చేపట్టవచ్చు. ఆయా కేంద్రాల్లో ఎంఆర్‌పీ ధరకే టీకా పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనంతా వైద్య శాఖ పర్యవేక్షిస్తుంది. రాష్ట్రంలో 18–59 సంవత్సరాల మధ్య వయసు గల 3.47 కోట్ల మందికి ప్రభుత్వమే ఇప్పటివరకూ రెండు డోసుల టీకా వేసింది. 60 ఏళ్లు పైబడిన వారికి జనవరిలోనే ప్రికాషన్‌ డోసు టీకా పంపిణీ ప్రారంభించగా.. 
ఈ కార్యక్రమం తుది దశకు చేరుకుంది.  

మరిన్ని వార్తలు