పంట చేనులో కోటి విలువైన వజ్రం!

21 Oct, 2020 11:58 IST|Sakshi

సాక్షి, కర్నూలు: జిల్లాలో విలువైన వజ్రం దొరికింది. తుగ్గలి మండలానికి చెందిన ఓ మహిళకు పొలంలో వేరుశెనగ తీస్తుండగా కోటి రూపాయలు విలువ చేసే వజ్రం దొరికింది. అయితే వజ్రాన్ని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగులు చేశారు. 11 లక్షల రూపాయల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి సదురు వ్యాపారి వజ్రాన్ని కొన్నట్లు సమాచారం. కాగా.. ఈ వజ్రం కోటి రూపాయలకు పైగా ధర పలుకుతుందని స్థానికులు భావిస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా