ఏపీ: ఖరీఫ్‌కు సన్నద్ధం

3 May, 2022 08:30 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: జూన్‌ నుంచి ఖరీఫ్‌–2022 సీజన్‌ మొదలు కానుంది. మే నుంచే రైతులు సేద్యపు పనులు ప్రారంభించనున్నారు. జూన్‌ నుంచి సెపె్టంబర్‌ మధ్య నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలకు పంటలు సాగులోకి రానున్నాయి.æ ప్రణాళిక, వ్యవసాయశాఖ అంచనా మేరకు ఈ ఖరీఫ్‌లో శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల పరిధిలో 6,52,741 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేయనున్నారు. అనంతపురం జిల్లాలో 3,76,810 హెక్టార్లు సాగు అంచనా వేశారు.  

2,43,578 హెక్టార్లలో వేరుశనగ 
జిల్లాలో ప్రధానపంట వేరుశనగ 2,43,578 హెక్టార్లలో సాగవనుంది. ఇందులో గుంతకల్లు మండలంలో అత్యధికంగా 15 వేల హెక్టార్లు, వజ్రకరూరు, కళ్యాణదుర్గంలో 14 వేల హెక్టార్లు, కూడేరు, గుత్తిలో 13 వేల హెక్టార్లు, రాయదుర్గం, బ్రహ్మసముద్రం, కుందురి్ప, ఉరవకొండ, బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట మండలాల్లో 10 వేల హెక్టార్లకు పైబడి విస్తీర్ణంలో వేరుశనగ వేయనున్నారు. తాడిపత్రి, యల్లనూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో మాత్రమే వెయ్యి హెక్టార్లలోపు సాగు చేసే పరిస్థితి నెలకొంది.  
ట పెద్దవడుగూరు మండలంలో పత్తి ఏకంగా 16 వేల హెక్టార్లు సాగు అంచనా వేశారు. ఆ తర్వాత పామిడి, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు, గుత్తి, వజ్రకరూరు, విడపనకల్లు, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, బొమ్మనహాళ్, శింగనమల మండలాల్లో పత్తి సాగులోకి రానుంది.  

టపుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు, యాడికి, రాయదుర్గం, డి.హీరేహాళ్, కణేకల్లు, బొమ్మనహాళ్‌ మండలాల్లో మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉంటుంది.  
ట ఆత్మకూరు, కూడేరు, గుంతకల్లు, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, కంబదూరు, గార్లదిన్నె మండలాల్లో ఆముదం పంట ఎక్కువగా సాగు చేయనున్నారు.  
ట గార్లదిన్నె, ఆత్మకూరు, కూడేరు, గుంతకల్లు, గుత్తి, రాప్తాడు, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో కంది అధికంగా సాగులోకి రావచ్చని అంచనా వేశారు.  

ఆర్బీకే ద్వారా విత్తనాలు, ఎరువులు 
ఖరీఫ్‌ సమీపిస్తుండటంతో రైతులకు ఇబ్బంది లేకుండా విత్తన వేరుశనగ, కంది తదితర విత్తనాల సేకరణ, అవసరమైన ఎరువుల సరఫరాపై వ్యవసాయశాఖ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఆర్‌బీకే వేదికగానే రైతులకు అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏవో) బి.చంద్రానాయక్‌ తెలిపారు.  

ఇది కూడా చదవండి: వైద్య శాఖలో బయోమెట్రిక్‌ తప్పనిసరి

మరిన్ని వార్తలు