మహిళలకు మరో ‘రత్నం’

7 Sep, 2020 10:42 IST|Sakshi

‘వైఎస్సార్‌ ఆసరా’ అమలుకు రంగం సిద్ధం

అధికారుల వద్ద డ్వాక్రా రుణాలు తీసుకున్న అర్హుల జాబితా

ఈ నెల 11న వారి ఖాతాల్లోకి తొలివిడత నగదు జమ  

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాలు పథకాల్లో మరో రత్నం మహిళలకు అందనుంది. బ్యాంకు రుణాలు తీసుకున్న డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి ఈ నెల 11న ‘వైఎస్సార్‌ ఆసరా’ కింద నగదు జమకానుంది. దీనికోసం అర్హుల జాబితా సిద్ధమైంది. జిల్లాలోని మహిళలకు నాలుగు విడతల్లో రూ.928.65 కోట్ల లబ్ధి చేకూరనుంది.  

సాలూరు: మహిళా సాధికారతే లక్ష్యంగా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తున్నారు. మహిళల ఆర్థిక పురోభివృద్ధికి అనువైన సంస్కరణలు చేపడుతున్నారు. రిజర్వేషన్లలో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. మహిళల పేరిట ఇళ్ల పట్టాల మంజూరు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ చేయూతతో 45 ఏళ్లు పైబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల ఖాతాలకు నేరుగా రూ.18,750 చొప్పున జమచేశారు. డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మొత్తాలను నాలుగు విడతల్లో వైఎస్సార్‌ ఆసరా పథకం కింద చెల్లింపులకు ప్రణాళిక రూపొందించారు. తొలివిడత లబ్ధిని అందజేసేందుకు ఏర్పా ట్లు పూర్తిచేశారు.  

జిల్లా మహిళలకు రూ.928.65 కోట్ల లబ్ధి 
జిల్లాలోని 9 నియోజకవర్గాల్లోని 34 మండలాల్లో సుమారు 36,759 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వాటిలో 5,04,906 మంది  సభ్యులు ఉన్నారు. వీరు 2019  ఏప్రిల్‌ 11 నాటికి  సుమారు 928.65 కోట్ల రూపాయల రుణాలు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. ఈ నగదును నాలుగు విడతల్లో ప్రభు త్వం చెల్లించనుంది. వైఎస్సార్‌ ఆసరా పేరుతో  అప్పు నిల్వల సొమ్ములో తొలివిడత నగదు ఈ నెల 11న నేరుగా వారి సంఘం పొదుపు ఖాతాలో జమచేయనున్నారు.  

హామీల అమలులో పెద్దకొడుకు...  
మాట తప్పని నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి డ్వాక్రా మ హిళల కష్టాలను తన సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రలో నేరు గా చూశారు. వారి వినతులను ఆలకించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన  రెండో ఏడాది నుంచి నాలుగు విడతల్లో బ్యాంకు రుణా లు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అనుకున్నట్టే మహిళలకు అండగా నిలిచేలా నవరత్న పథకాల్లో ‘వైఎస్సార్‌ ఆసరా’ ను చేర్చారు. ఓ సోదరుడిలా, ఓ పెద్దకొడుకుగా వ్యవహరి స్తూ మహిళలకు జగనన్న ఉన్నాడనే భరోసా కలి్పంచారు.  

మహిళలకు ఆర్థిక అండ
మహిళలకు ఓ పెద్దకొడుకుగా, సోదరుడిగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తున్నా రు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలులో వెనుకడుగు వేయడం లేదు. వైఎస్సార్‌  చేయూత, తాజాగా  వైఎస్సార్‌ ఆసరాతో ఆదుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీచేస్తామని చెప్పి మహిళలను మోసం చేసింది. అందుకే అశేష మహిళాలోకం 2019 ఎన్నికల్లో టీడీపీకి బుద్ధిచెప్పి వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టింది.
– పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌ 

ఈ నెల 11న పథకం అమలు..  
వైఎస్సార్‌ ఆసరా పథకం కింద ఈ నెల 11న తొలివిడత డ్వాక్రా రుణాల నగదు చెల్లించనున్నారు. నాలుగు విడతల్లో మహిళల ఖాతాలకు ప్రభుత్వం జమచేయనుంది. వాటిని మహిళలు సద్వినియో గం చేసుకోవాలి.
– సావిత్రి, వెలుగు ఏపీడీ   

సీఎం మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలస్తున్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలను మోసం చేసింది. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన రెండవ ఏడాది నుంచి  వైఎస్సార్‌ ఆసరా కింద డ్వాక్రా రుణాలను నాలుగు విడతల్లో  మాఫీకి సిద్ధమయ్యారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడిగా మరోసారి రుజువు చేసుకున్నారు.  
– రెడ్డి పద్మావతి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు  

మరిన్ని వార్తలు