Presidential Elections 2022 In AP: ఓటు వేయని టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్యచౌదరి

18 Jul, 2022 17:19 IST|Sakshi

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఏపీలో 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 151 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎన్.వెంకట్‌ గౌడ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో కలుపుకొని ఇప్పటి వరకు మొత్తం 169 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. మంత్రి పినిపే విశ్వరూప్‌, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, ఎం.శంకర్ నారాయణ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం 167 మంది శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

► మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొత్తం 175 మంది శాసన సభ్యుల్లో 161 మంది శాసనసభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా 14 మంది శాసన సభ్యులు ఓటు వేయాల్సి ఉంది. 

 ఓటు వేసిన అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

► ఓటు వేసిన పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, హోం శాఖ మంత్రి తానేటి వనిత

► ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటు వేశారు.

ఏపీ అసెంబ్లీలో 174 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు వేయనున్నారు.

 ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, స్పీకర్ తమ్మినేని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు.

► ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకి వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది.

► టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు తెలిపింది. 

 15వ రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం బ్యాలెట్‌ బ్యాక్సులను ఇప్పటికే రాష్ట్రాలకు తరలించింది. ఈ ఎన్నికల్లో  4,809 మంది ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సోమవారం తమ ఓటు వేయనున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో, రాష్ట్రాల్లో అసెంబ్లీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. 21న పార్లమెంట్‌హౌస్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నూతన రాష్ట్రపతి 25న ప్రమాణస్వీకారం చేస్తారు.

మరిన్ని వార్తలు