విశిష్ట సేవలకు..రాష్ట్రపతి పోలీస్‌ పతకాలు

26 Jan, 2022 03:44 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌కు ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం

పలువురికి పోలీసు ప్రతిభా పతకాలు

వివిధ విభాగాల్లో అధికారులకు పతకాలు

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి అమరావతి/నెట్‌వర్క్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విశిష్ట, ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు కేంద్రప్రభుత్వం పతకాలను ప్రకటించింది. వీటిలో ఏపీకి ఒక రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం, పలు రాష్ట్రపతి పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనాకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం లభించింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న వారికి కూడా పలు పతకాలు లభించాయి.

పోలీసు ప్రతిభా పతకాలు
1. ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు, డీఐజీ (లా అండ్‌ ఆర్డర్‌)
2. ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ తూర్పు గోదావరి జిల్లా    
3. శ్రీరాంబాబు వాక, డీఎస్పీ, సీఐడీ, నెల్లూరు    
4. విజయపాల్‌ కైలే, ఏసీపీ, ఈస్ట్‌ జోన్, విజయవాడ
5. విజయ్‌కుమార్‌ బుల, అసిస్టెంట్‌ కమాండెంట్, గ్రేహౌండ్స్, విశాఖపట్టణం    
6. సుబ్రహ్మణ్యం కొలగాని, అదనపు డీసీపీ, విశాఖపట్టణం    
7. శ్రీనివాసరావు చుండూరు, డీఎస్పీ, విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్, గుంటూరు    
8. వీరరాఘవరెడ్డి, డీఎస్పీ, అనంతపురం    
9. రవీందర్‌రెడ్డి ఎర్రమోరుసు, డీఎస్పీ, కర్నూలు
10. కృష్ణారావు గొల్ల, ఎస్‌ఐ, సీసీఎస్, విజయవాడ
11. సత్తారు సింహాచలం, అసిస్టెంట్‌ రిజర్వ్‌ ఎస్‌ఐ, కాకినాడ
12. నరేంద్రకుమార్‌ తుమాటి, ఏఎస్‌ఐ, గుంటూరు అర్బన్‌
13. పేరూరు భాస్కర్, ఏఎస్‌ఐ, కడప    
14. నాగశ్రీనివాస్, ఏఎస్‌ఐ, కొవ్వూరు రూరల్‌
15. వీర ఆంజనేయులు సింగంశెట్టి, ఏఎస్‌ఐ, ఏసీబీ, విజయవాడ రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవాపతకం భావనా సక్సేనా, రెసిడెంట్‌ కమిషనర్, ఏపీ భవన్, న్యూఢిల్లీ

కేంద్ర జీఎస్టీ విభాగంలో..
1. డబ్లు్య.డి.చంద్రశేఖర్, అదనపు సహాయ డైరెక్టర్, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ కార్యాలయం, విశాఖపట్నం
2. కర్రి వెంకటమోహన్, అదనపు సహాయ డైరెక్టర్, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌

సీబీఐలో..
1. సుబ్రహ్మణ్యం దేవేంద్రన్, అదనపు న్యాయసలహాదారు
2. కె.వి.జగన్నాథరెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్, ఏసీబీ

రైల్వే పోలీసుల్లో..
మస్తాన్‌వలి షేక్, ఏఎస్‌ఐ, ఆర్పీఎఫ్, తాడేపల్లి

జైళ్లశాఖలో
1. అయినపర్తి సత్యనారాయణ, హెడ్‌ వార్డర్, ఆంధ్రప్రదేశ్‌
2. పోచ వరుణారెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్‌
3. పెదపూడి శ్రీరామచంద్రరావు, డిప్యూటీ సూపరింటెండెంట్, విశాఖపట్నం కేంద్రకారాగారం
4. మహ్మద్‌ షఫీ ఉర్‌ రెహమాన్, డిప్యూటీ సూపరింటెండెంట్‌
5. సముడు చంద్రమోహన్, హెడ్‌ వార్డర్‌
6. హంసపాల్, సూపరింటెండెంట్, కృష్ణాజిల్లా జైలు

జీవన్‌ రక్షాపథక్‌ సిరీస్‌ ఆఫ్‌ అవార్డ్స్‌–2021
1. జి.సంజయ్‌కుమార్‌ 2. టి.వెంకటసుబ్బయ్య
3. నిర్జోగి గణేశ్‌కుమార్‌ 

మరిన్ని వార్తలు