నెల్లూరు, సంగం బ్యారేజ్‌లకు ప్రతిష్టాత్మక సీబీఐపీ అవార్డు 

18 Feb, 2023 08:57 IST|Sakshi
నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ (ఫైల్‌)

3న ఢిల్లీలో అవార్డును ప్రదానం చేయనున్న కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌

పెన్నా డెల్టా ఆధునికీకరణలో భాగంగా సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను చేపట్టిన వైఎస్సార్‌

సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక యుద్ధప్రాతిపదికన ఆ రెండు బ్యారేజ్‌లు పూర్తి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రతిష్టాత్మక సీబీఐపీ అవార్డుకు ఎంపికయ్యాయి. పెన్నా డెల్టా ఆధునికీకరణలో భాగంగా నెల్లూరు (0.4 టీఎంసీలు), సంగం బ్యారేజ్‌ (0.45 టీఎంసీలు)లను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది.  యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసింది. 4.22 లక్షల ఎకరాలకు సమర్థంగా నీటిని అందిస్తోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ.. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ (సీబీఐపీ) ప్రశంసించింది. అత్యుత్తమ ప్రాజెక్టులుగా నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ప్రకటించి సీబీఐపీ–2022 అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును మార్చి 3న సీబీఐపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ రాష్ట్ర అధికారులకు ప్రదానం చేయనున్నారు. సీబీఐపీ.. దేశంలో నీటివనరులు, విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో అత్యుత్తమ ప్రాజెక్టులను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తోంది.

కరోనాను, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి.. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పెన్నా డెల్టా ఆధునికీకరణ పనులను చేపట్టారు. నెల్లూరు, సంగం బ్యారేజ్‌ల నిర్మాణ పనులను చేపట్టారు. ఆయన హఠాన్మరణంతో ఆ బ్యారేజ్‌ల పనులకు గ్రహణం పట్టుకుంది. తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్‌ వీటిని పట్టించుకోలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక.. కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆరి్థక ఇబ్బందులను అధిగమించి సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను 2022, ఆగస్టు 31 నాటికి పూర్తి చేశారు. సెపె్టంబర్‌ 6న ఆయన వాటిని జాతికి అంకితం చేశారు.  

సీఎం జగన్‌ దార్శనికతకు పట్టం 
నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను చిత్తశుద్ధితో యుద్ధప్రాతిపదికన సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేశారు.  బ్యారేజ్‌లతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు­పడ్డాయి. సీఎం  జగన్‌ దార్శనికతకు పట్టం కడుతూ సీబీఐపీ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది.
– శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు